ePrivacy and GPDR Cookie Consent by Cookie Consent

Shayari 2026. hindi shayari 2026| हिंदी शायरी | Shayari 2026 | 2026 Shayari | 2026 Ki Shayari | 2026shayari | 2026शायरी.Dard Shayari

Breaking

Friday, 17 April 2020

మావాస్య రోజున నిండు పున్నమి Full moon day Telugu Story




  అవి కాలేజీ రోజులు. జీవితం అందంగా యెటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఓ చల్లటి సాయంత్రం ఫ్రెండ్స్ అందరం క్యాంపస్ గార్డెన్ లో కూర్చున్నాం. కుహూ కుహూ మని కోయిల రాగాలు తీస్తూ తనతో జత కూడమని అజ్ఞాపిస్తోంది. ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చెయ్యడంతో ఓ మధురమైన పాట పాడాను. మొదటిసారి నా సొంతంగా అల్లిన పాట పాడాను. నా పాట వింటున్న కొమ్మ మీద కోయిల తన రాగాన్ని నాతో జత చేసింది. 
అలా రోజు నన్ను చూడగానే నవ్వేది పలకరించేది. నా నోట్స్ అడిగి తీసుకునేది. నాతో పాడించుకునేది. అలా మాకు తెలియకుండానే మా మధ్య ఇంకేదో బంధం పెనవేసుకుంది. ఏడాది గడిచేకొద్దీ మనసులోమాట బయటపెట్టేసుకున్నాం..ఇంకో ఆర్నెల్లు ప్రేమ యాత్ర చేసుకుని అలసిసొలసి పెళ్ళిచేసుకోవాలని నిర్ణయానికి వచ్చేశాం. పెద్ద వాళ్ళతో మా ప్రేమ గురించి మాట్లాడాలని అనుకున్నాం.
   ఆమె క్రిస్టియన్. నేను హిందు. స్వతహాగా మా అమ్మ నాన్న చాలా పట్టింపులున్న వాళ్ళు. ఆమెను కోడలిగా తెస్తే విషం తాగుతాము అని బెదిరించారు. నందినీ ఫాదర్ కూడా మా పెళ్ళికి రెడ్ సిగ్నల్ ఇవ్వడం తో చేసేది లేక బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయానికి వచ్చాను. ఒకప్పుడు నేను నెమ్మది మనిషిని. కుటుంబం అంటే ఎంతో ప్రేమ. అలాంటి నేనే లేచిపోవడం గురించి మాట్లాడాను అంటే నందినీ ప్రేమ నన్నేంతగా మార్చిందో. 
ఆమె లేని నా జీవితం వృధా అనిపించింది. ఆమెను నేను వదులుకుని ఉండలేను. అందుకే తర్వాతైనా అమ్మ వాళ్ళను ఒప్పించవచ్చు. నా నిర్ణయాన్ని నందినితో చెప్పా. మొదట్లో ఆమె ఒప్పుకోలేదు. తన తండ్రికి మోసం చేస్తే జీసస్ క్షమించడు అంది. తను లేక పోతే తన తండ్రి బతకడు అని వాదించింది. చివరకు తన ప్రేమను చంపుకోలేక నాతో గోవా బయలుదేరింది.
    నేను లేకుండా నువ్వు బతకలేవనీ తెలుసు. నేను నీతో లేచిపోతే మా నాన్న నాకు దక్కరని తెలుసు. ప్రేమ పేరుతో నీకు దగ్గర అయ్యింది నేనే..నీ మనస్సు లో కోటి ఆశలు రేపింది నేనే అందుకే నీకో తీపి జ్ఞాపకం ఇచ్చి నీ ఋణం తీర్చుకోవాలి అనుకున్నా. నీ లాంటి ప్రేమికుని పొందడం నా అదృష్టం . నన్ను నన్నుగా ప్రేమించేవారు ఉన్నారని తెలిపావు. 

No comments:

Post a Comment

loading...